శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:28 IST)

అంధకారంలోకి చంఢీఘర్‌ - 32 గంటలుగా ఆగిన విద్యుత్ సరఫరా

పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చంఢీఘర్‌లో ప్రస్తుతం అంధకారంలో చిక్కుకుంది. గత 36 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. ముఖ్యంగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించి 48 గంటలుగా నిరసన చేస్తున్నారు. దీంతో చంఢీఘర్ ప్రాంతంలో అంధకారంలోకి చిక్కుకునిపోయింది. 
 
ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆస్పత్రులు, గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లక్షలాది ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. ఆస్పత్రులకు కరెంట్ సరఫరా ఆగిపోవడంతో అత్యవసర సేవలు స్తంభించిపోయాయి. ఆస్పత్రుల్లో ఉన్న జనరేటర్లు సరిగా పనిచేయక పోవడంతో ప్రైవేట్ జనరేటర్లను అద్దెకు తీసుకుని, ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందిస్తున్నారు. మరోవైపు, విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టిసారించారు.