శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (17:02 IST)

డాక్టర్ల సేవలకు సలాం... వైద్య రంగానికి రూ.2 వేల కోట్లు

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి సేవలకు సలాం చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వైద్యులు చేసిన సేవలు అమోఘమని మోడీ కొనియాడారు. 
 
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ మాట్లాడుతూ, కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నప్పటికీ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా బాధితుల ప్రాణాలు కాపాడారన్నారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని చెప్పారు. 
 
అంతేకాకుండా, వైద్య రంగం కోసం రూ.2 లక్షల కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు చెప్పారు. కరోనా సమయంలో లక్షలాది మందికి సేవలు అందించడానికి డిజిటల్ ఇండియా పథకం దోహదపడిందన్నారు. ఈ పథకంలో భాగంగా అనేక పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 
 
ముఖ్యమైన డాక్యుమెంట్లను దాచుకోవడానికి డిజిలీకర్, కోవిడ్ ట్రేసింగ్ కోసం ఆరోగ్యసేతు వంటి యాప్‌లను ప్రజల ముంగిటకు తీసుకొచ్చామని తెలిపారు. మన దేశం అమలు చేస్తున్న డిజిటల్ సొల్యూషన్స్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.