ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16ఏళ్ల విద్యార్థి మృతి.. ఎముకలు విరిగి..?
ఢిల్లీలోని హర్ష్ విహార్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఘటన సమయంలో విద్యార్థితో పాటు అతని సహచరులు కూడా ఉన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వజీరాబాద్ రోడ్డులోని మండోలి జైలు సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. మృతుడు ఘజియాబాద్‌లోని గగన్ విహార్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని మండోలి ఎక్స్‌టెన్షన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
మృతుడు రెయిలింగ్‌పై వాలాడు. అయితే బ్రిడ్జి ఫుట్‌ఓవర్‌పై రెయిలింగ్‌లో కొంత భాగం విరిగిపోవడంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనలో స్కూల్ స్టూడెంట్‌కి గాయాలు ఏర్పడ్డాయి. తోటి విద్యార్థులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించాడు.