ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (15:50 IST)

సిక్కిం వరదల్లో గల్లంతైన దాన వీర శూర కర్ణ నటి

Sarala Kumari
Sarala Kumari
సిక్కిం వరదల్లో ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి గల్లంతైనట్లు సమాచారం. సరళ కుమారి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ 'దాన వీర శూర కర్ణ'లో నటించారు. 'సంఘర్షణ' తదితర సినిమాల్లోనూ నటించారు. 
 
ఇక సిక్కిం వరదల్లో సరళ కుమారి గల్లంతైన విషయాన్ని అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె నబిత ధ్రువీకరించారు. అమ్మ ఆచూకీని గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 
 
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న సరళ కుమారి అక్టోబర్ 2న స్నేహితులతో కలసి సిక్కిం పర్యటనకు వెళ్లినట్టు ఆమె కుమార్తె తెలిపారు. అక్కడ ఓ హోటల్‌లో బస చేసినట్టు తెలిపారు.
 
చివరిగా ఈ నెల 3న అమ్మతో ఫోన్‌లో మాట్లాడానని, ఆ తర్వాత అమ్మతో సమాచారం లేదంటూ నబిత తెలిపారు. దయచేసి అమ్మ ఎక్కడ ఉందో ఆచూకీ కనుక్కోవాలని కోరారు.