శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 14 డిశెంబరు 2017 (17:50 IST)

గుజరాత్ ఎగ్జిట్ పోల్స్: మళ్లీ మోదీ హవా... కాంగ్రెస్ పార్టీకి పవర్ పంచ్ తప్పదా?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పట్ల దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇవాళ ఓటింగ్ ముగియడంతో వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. వీటిని చూస్తుంటే మళ్లీ నరేంద్ర మోదీ హవా సాగుతుందని కనబడుతోంది. గుజరాత్ అసెంబ్లీకి మొత్తం 182 స్థానాలు వుండగా అధికారంలోకి రావాలంటే

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పట్ల దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇవాళ ఓటింగ్ ముగియడంతో వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. వీటిని చూస్తుంటే మళ్లీ నరేంద్ర మోదీ హవా సాగుతుందని కనబడుతోంది. గుజరాత్ అసెంబ్లీకి మొత్తం 182 స్థానాలు వుండగా అధికారంలోకి రావాలంటే 92 స్థానాలు గెలుచుకోవాల్సి వుంటుంది.
 
ఈ నేపధ్యంలో వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ఒక్కసారి చూస్తే... టైమ్స్ నౌ వివరాలు, బీజేపి 109, కాంగ్రెస్ 70, ఇతరులు 3 గెలుచుకుంటారని వెల్లడించింది. ఇక సీ ఓటర్ అయితే భాజపాకు 108 స్థానాలు దక్కుతాయనీ, కాంగ్రెస్ పార్టీకి 74 స్థానాలు వస్తాయని పేర్కొంది. 
 
హార్దిక్ పటేల్ అంశం కాంగ్రెస్ పార్టీకి పెద్దగా లాభించలేదని తెలుస్తోంది. భాజపా పైన వ్యతిరేకత వున్నప్పటికీ లా అండ్ ఆర్డర్ బాగానే వున్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిఎస్టీ పై ప్రభుత్వంతో ఇబ్బంది వున్నప్పటికీ భాజపా తన తప్పులను సరిదిద్దుకుంటుందన్న నమ్మకం వున్నదని ప్రజలు విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు నిజమవుతాయా లేదో చూడాలంటే డిసెంబరు 18 వరకూ వేచి చూడాల్సిందే.