గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 డిశెంబరు 2025 (15:58 IST)

మానవత్వం మరుగయిపోతుందా? రోడ్డుపై గుండెపోటుతో వ్యక్తి, అతడి భార్య సాయం అర్థిస్తున్నా... (video)

man suffered with heart attack on the road
మానవత్వం చచ్చిపోయిందా అనే సందేహాలు కొన్ని సంఘటనలు చూసినప్పుడు వస్తుంటాయి. కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ద్విచక్రవాహనంపై తన భార్యతో కలిసి వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీనితో అతడు వాహనం నడపలేకపోవడంతో ఇద్దరూ కిందపడిపోయారు. వెంటనే తేరుకున్న అతడి భార్య రోడ్డుపై వెళ్తున్న వారిని సాయం కోసం అర్థించింది.
 
కానీ దారిన వెళ్తున్నవారు ఏ ఒక్కరూ వారిని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని రోడ్డుపై అలా చూస్తూ వెళ్లారే తప్ప ఏ ఒక్కరూ సాయం అందించలేదు. దీనితో ఆ జంట అలాగే ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ బాధితుడు మార్గమద్యంలోనే ప్రాణాలు వదిలాడు. రోడ్డుపై వెళ్లేవారిలో ఏ ఒక్కరు స్పందించినా అతడి ప్రాణాలతో జీవించి వుండేవాడు కానీ ఎవ్వరూ సాయం అందించలేదు.