1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2016 (15:12 IST)

రంజాన్ మాసమంతా.. మసీదులకు ఉచిత బియ్యం: జయమ్మ ప్రకటన

ఎన్నికల సందర్భంగా ప్రజలపై వరాల వర్షం కురిపించిన తమిళనాడు సీఎం జయలలిత.. తాజాగా వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింకు మరో వరాన్ని ప్రసాదించారు. తమిళనాడులో గుర్తింపు పొందిన 3 వేలకు పైగా మసీదులకు రంజాన్ మాసాంతం ఉచితంగా బియ్యం అందిస్తామని.. ఇందుకోసం 4,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్ధం చేసినట్లు జయమ్మ ప్రకటించారు. 
 
ఆయా మసీదులకు నెల మొత్తం బియ్యాన్ని అందించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని జయమ్మ పోలీసు శాఖకు ఆదేశాలు జారీచేశారు. కాగా, 2001లో ఏఐఏడీఎంకే ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత మసీదులకు ఉచిత బియ్యం పథకం ప్రారంభమైంది. అప్పుడు అటకెక్కిన ఈ స్కీమ్‌ను పునరుద్ధరించడంపై ముస్లిం వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.