1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2016 (11:44 IST)

ఒడిశాలో మరో నిర్భయ... బస్సులో యువతిపై సామూహిక అత్యాచారం

ఒడిశా రాష్ట్రంలో మరో నిర్భయ కేసు జరిగింది. 17 యేళ్ల యువతిని ఒక డ్రైవర్‌, కండక్టర్‌ బస్సులో సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. బాంకీ శివారుల్లోని మహానదిపై ఉన్న జాతముండియా వంతెన కింద ఒక యువతి మృతదేహాన్ని ఈ నెల 2న అర్థనగ్న స్థితిలో పోలీసులు కనుగొన్నారు. ఆమెను అత్యాచారం చేసి, హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. 
డ్రైవర్‌తో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన ఆ యువతి... తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ఆమెతో వివాహం ఇష్టం లేని డ్రైవర్‌ సంతోష్‌ సాహు.. హతమార్చాలని పథకం పన్నాడు. 'విహారానికి తీసుకెళ్తానని నమ్మించి అతాగఢ్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతమైన రతాగఢ్‌కు తీసుకెళ్లాడు. కండక్టర్‌ బిభూతీ రౌత్‌తో కలిసి బస్సులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం బస్సు చక్రాలను మార్చడానికి ఉపయోగించే రెంచితో తలపై పలుమార్లు తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ యువతిని గౌరంగాపూర్‌ వాసిగా గుర్తించారు. ఈ కేసులో బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.