శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (13:24 IST)

మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ర్యాలీ: రేవంత్

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు 'భారత్​ బచావో​' పేరిట నేడు దిల్లీలోని రాం​లీలా మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్ ర్యాలీకి మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. భాజపా ప్రభుత్వ విభజనవాదం, విధ్వంసక వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకే ర్యాలీ చేపడుతున్నట్లు రేవంత్​రెడ్డి తెలిపారు.

రాష్ట్రం నుంచి 4 వేల మంది నేతలు, కార్యకర్తలు దిల్లీ వెళ్లినట్లు పేర్కొన్నారు. మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మోదీ దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

నోట్ల రద్దు వికటించి ఆర్థిక పరిస్థితి మందగించిందని.. సమస్యలపై కలుద్దామంటే ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ రాచరిక పాలనలో తెలంగాణ బందీ అయిందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ దోపిడీ ఆపితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. మిగులు రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురు మాత్రమే శ్రీమంతులు అయ్యారని.. రాష్ట్రం మాత్రం దివాలా తీసిందని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.