ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్ ఆ సంస్థ బాధ్యతలనుంచి శుక్రవారం వైదొలిగారు. మూడు దశాబ్దాల క్రితం పర్సనల్ కంప్యూటర్ విప్లవాన్ని పసిగట్టి హార్వార్డ్ యూనివర్శిటీ చదువును 1975లో వదిలిపెట్టిన బిల్‌గేట్స్...