హీరో రామ్ చరణ్‌పై పోలీసు కేసు... 'ఎవడు'లో అశ్లీలం ఉందంటూ!

Ganesh| Last Modified బుధవారం, 15 జనవరి 2014 (14:19 IST)
FILE
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్‌పై పోలీసు కేసు నమోదయ్యింది. అభిమానులకు సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా ఇటీవల విడుదలచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అశ్లీల సన్నివేశాలున్నాయంటూ హీరో రామ్ చరణ్‌పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్ చరణ్, చిత్ర దర్శక నిర్మాతలు తదితరులపై ఐపీసీ 292 సెక్షన్ కింద ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.


దీనిపై మరింత చదవండి :