రాష్ట్రంలో త్వరలో జరుగనున్న 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల్లో ఎంతగా శ్రమించినా అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పైపెచ్చు రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటం, రాష్ట్ర పరిస్థితులు ఏమాత్రం తమకు అనుకూలంగా లేకపోవడంతో ప్రచారం కోసం ఎక్కువ శ్రమించడం ఎందుకనే భావన వారిలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.