యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మానస పుత్రికల్లో ఒకటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గ్రామీణ ప్రాంత వాసులకు ఏడాదిలో వంద రోజుల పాటు ఉపాధి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకం అమలులో పలు రాష్ట్రాలు పూర్తి అశ్రద్ధ చూపిస్తున్నాయి.