ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల కులం పేరును తొలగించవలిసిందిగా ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ ఒక ప్రజాప్రయోజన వాజ్యం లేవనెత్తిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఓటర్ల జాబితాలో కులం పేరును నమోదు చేయడం వల్ల కుల తత్వ రాజకీయాలు ప్రబలిపోతున్నాయని ఆరోపిస్తూ వేలు గాంధీ అనే గాంధేయవాది సుప్రీం కోర్టులో పిల్ వేశారు.