అక్షరధామ్ దాడి కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ పోటా కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. 2002 సంవత్సరం సెప్టెంబరు 24వ తేదీన ఇద్దరు తీవ్రవాదులు అహ్మదాబాద్, గాంధీనగర్‌లో ఉన్న అక్షరధామ్‌పై ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనైడ్లతో దాడి చేశారు. ఇందులో 32 మంది చనిపోయారు. వీరిలో 28 మంది సందర్శకులు ఉండగా, ఇద్దరు కమెండోలు, ఒక ఎన్.ఎస్.జి కమెండో, స్టేట్ రిజర్వు పోలీసుకు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు.