ప్రవాస భారతీయ వైద్యుడు గౌతమ్ బొడివాలా అంతర్జాతీయ అత్యవసర వైద్య సమాఖ్య అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. లీసెస్టర్ వర్సిటీలో వైద్య అధ్యాపకుడిగా పనిచేస్తున్న గౌతమ్ ఈ వైద్య సమాఖ్యను 1991 సంవత్సరంలో స్థాపించారు. కాగా.. ఈ అత్యవసర వైద్య సమాఖ్యకు తొలిసారిగా నిర్వహించిన ఎన్నికల్లో వ్యవస్థాపకుడైన గౌతమ్ అధ్యక్షుడిగా ఎంపికవటం విశేషంగా చెప్పవచ్చు.