ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా జాత్యహంకారపు రక్కసి కోరలకు మరో ముగ్గురు భారతీయులు చిక్కి గాయపడ్డారు. ప్రస్తుతం దాడులు తగ్గుముఖం పట్టాయని, దాడుల అణచివేతకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ఆసీస్ ప్రభుత్వం ఎన్నిరకాలుగా ప్రకటించినా.. ఈ దాడులకు అడ్డుకట్ట పడే మార్గం కనిపించటం లేదు. పైగా రోజు రోజుకీ అవి తీవ్రమవుతున్నాయి.