ఆస్ట్రేలియాలో మరో భారతీయుడి ఆత్మహత్య

Nri News
Ganesh|
FILE
ఆస్ట్రేలియాలో మరో భారతీయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిడ్నీలోని హారిస్ పార్క్ ప్రాంతంలో వేగంగా వెళుతున్న రైలుకు ఎదురుగా వెళ్లి.. గురువారం 35 సంవత్సరాల భారతీయ యువకుడొకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషయమై సిడ్నీలోని భారత ప్రధాన దౌత్యాధికారి అమిత్ దాస్ గుప్తా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మృతుడి అందజేసిన సమాచారం ప్రకారం అతడు భారతీయుడిగా గుర్తించినట్లు వెల్లడించారు. అయితే మృతుడి పేరును వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

అంతేగాకుండా... సదరు భారతీయ యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని గుప్తా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌లోనే గుర్జీందర్ సింగ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన వారం రోజుల్లోపే మరో ఆత్మహత్య సంఘటన చోటు చేసుకోవటంతో భారతీయులందరిలోనూ తీవ్ర ఆందోళన చోటు చేసుకుంటోంది.


దీనిపై మరింత చదవండి :