ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారవేత్త శాంత్ సింగ్ ఛత్వాల్ను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఛత్వాల్కు వ్యతిరేకంగా స్వతంత్ర పాత్రికేయుడు ఎస్ కే షా వేసిన పిటీషన్ను విచారించేందుకు చీఫ్ జస్టీస్ మదన్ బీ లోకుర్ తిరస్కరించారు.