జాత్యహంకార దాడులను సహించబోమని, విదేశీ విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కట్టుబడి ఉందని.. విక్టోరియా రాష్ట్ర ప్రధాని జాన్ బ్రంబీ స్పష్టం చేశారు. జాతి వివక్ష దాడులను అణచివేసేందుకు తమ రాష్ట్ర పోలీసులకు మరిన్ని అధికారాలను కట్టబెట్టామని ఆయన తెలిపారు.