విదేశాల్లో ముఖ్యంగా ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు పెరిగిన నేపథ్యంలో... వారి సంక్షేమం కోసం, రక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐఏ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రవాస భారతీయుల సమాచారాన్ని తెలియజేసే కేంద్రాన్ని (డేటా బ్యాంక్)ను ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది.