బ్రిటన్ ఎన్నికల్లో హిందూ ఓటర్ల పాత్రే కీలకం..!!

Elections
Ganesh|
FILE
బ్రిటన్‌లో మే నెల 9వ తేదీన జరిగే సాధారణ ఎన్నికల్లో హిందూ ఓటర్లే కీలక పాత్ర పోషిస్తారని.. యూకేలోని హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ ఫోరం ఒకటి అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక్కడ నివసిస్తున్న 7,50,000కి పైగా హిందువులు దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనీ ఈ మేరకు ఫోరమ్ వ్యాఖ్యానించింది.

ముఖ్యంగా బ్రిటన్ పార్లమెంటులో తమకు ప్రాతినిధ్యం వహింటం, తమ సమస్యలపై పోరాడటం లాంటి లక్షణాలున్న అభ్యర్థులకే ముఖ్యంగా హిందువుల ఓట్లు పడే అవకాశం ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా హిందూ ఫోరమ్ వెల్లడించింది. కాగా.. బ్రిటన్‌లోని లండన్ సబర్బన్ ప్రాంతాలైన సౌత్ ఈస్ట్, లీసెస్టర్, వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌, గ్రేటర్ మాంచెస్టర్ మరియు యార్క్‌షైర్‌లలో హిందువుల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం గమనార్హం.


దీనిపై మరింత చదవండి :