నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా...

Venkateswara Rao. I|
WD

నువ్వు వస్తావని బృందావని

ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..

నువ్వు వస్తావని బృందావని

ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా

వేణువు విందామని నీతో వుందామని

నీ రాధా వేచేనయ్యా

రావయ్యా... ఓ....

గిరిధర మురహర రాధా మనోహరా...

నువ్వు వస్తావని బృందావని

ఆశగ చూసేనయ్యా

కృష్ణయ్యా..రావయ్యా..

నీవు వచ్చే చోటనీవు నడిచే బాట

మమతల దీపాలు వెలిగించానూ

మమతల దీపాలు వెలిగించానూ

కుశలము అడగాలని పదములు కడగాలని

కన్నీటి కెరటాలు తరలించానూ

ఓ....ఓ....

గిరిధర మురహర నా హృదయేశ్వరా..

నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా

నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా

కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా.... కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా....

నీ పద రేణువునైనా పెదవుల వేణువునైనా

బ్రతుకే ధన్యమని భావించానూ..

బ్రతుకే ధన్యమని భావించానూ నిన్నే చేరాలని

నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించానూ..

గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా...

గోపాలా.......

చిత్రం: మల్లెపువ్వు

గాత్రం: వాణీజయరాం

సంగీతం: చక్రవర్తి

రచన: ఆరుద్రదీనిపై మరింత చదవండి :