సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 17 జనవరి 2022 (23:08 IST)

ఇలాంటి వధూవరులకే వివాహం చేయాలి, అలా వుంటే చేయకూడదు...

పెళ్లంటే నూరేళ్ల పంట. కనుక ఆ వివాహానికి జాతక పొంతన అవసరం అనేది జ్యోతిష నిపుణులు చెప్పే మాట. ఒకే నక్షత్రంలో జన్మించిన వధూవరులకు వివాహం చేయకూడదు. కనీసం పాద భేదమైనా వుండాలి. లేదంటే వేర్వేరు నక్షత్రాలు, రాశులైనా మంచిది. ఇద్దరిదీ ఒకే గణమైతే మంచిది.

 
దేవగణం, మనుష్యగణం అయితే మధ్యమం. మనుష్య-రాక్షస గణములైతే వివాహం చేయరాదు. పొంతనలలో విరోధులవుతారు. పొంతనలో విరోధ జంతువులు కాకూడదు. స్త్రీ రాశి నుంచి పురుష రాశి వరకూ లెక్కించగా 1, 3, 4, 5, 7, 8, 12 ఈ సంఖ్యలలో ఏదయినా శుభమే.

 
పురుష రాశి మొదలుకును స్త్రీరాశి వరకు లెక్కింపగా 1, 2, 6, 7, 9, 10, 11 ఈ సంఖ్యలలో ఏదైనా శుభం. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లను ఇచ్చి వివాహం చేయరాదని పండితుల మాట. అంతేకాదు... ఒకే లగ్నంలో ఇద్దరు అన్నదమ్ములకు గాని, ఇద్దరు అక్కాచెల్లెళ్లకు గాని పెళ్లి చేయకూడదు.