Personality Development

Notifications

  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం



ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న తెలంగాణ సీఎం

ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న తెలంగాణ సీఎం79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొత్తగా మంజూరైన, లామినేట్ చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సంబంధించిన షెడ్యూల్‌కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డిలో రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుండగా, అక్కడ ముఖ్యమంత్రి స్వయంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే సమయంలో, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్.. ఆ వార్తల్లో నిజం లేదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్.. ఆ వార్తల్లో నిజం లేదు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరించనున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన బృందం తీవ్రంగా ఖండించింది. "ఈ వార్తలు అవాస్తవం, నిరాధారమైనవి" అని పేర్కొన్న ఆ బృందం, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది. గత రెండు రోజులుగా ఆయనకు సంబంధించిన వార్తలు ప్రచారంలో ఉన్నాయి, వాటిని ఖండిస్తున్నామని మెగాస్టార్ బృందం వెల్లడించింది. అంతకుముందు, చిరంజీవి రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, చర్చలు తుది దశలో ఉన్నట్లు టాక్ వచ్చింది.

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్ఈమధ్య సినీ ట్రెయిలర్, ఆడియో, టీజర్ తదితర ఫంక్షన్లలో విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది దుస్తులు గురించి నేను మాట్లాడనమ్మా.. లేనిపోనిది మాట్లాడితే తంటా అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలే జరుగుతున్నాయి. తాజాగా హుషారు పిట్టలు చిత్రం మీడియా సమావేశంలో ఈవెంట్ వేదికపై నుంచి మాట్లాడుతున్న నటుడు పుట్టా భాను ఒక్కసారిగా చెంపకేసి పదేపదే కొట్టుకున్నాడు. దీనితో స్టేజి మీద వున్నవారు అవాక్కయ్యారు. మీడియా మిత్రులు సైతం విస్మయానికి లోనయ్యారు. పుట్టా భాను మాత్రం తనను తాను బిగ్ స్క్రీన్ పైన చూసుకుని నమ్మలేకపోతున్నాననీ, అందుకే ఇలా చెంప పగలగొట్టుకుంటున్నా అని చెప్పాడు.

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

అనకాపల్లి మూవీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా: సోనూ సూద్