1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రైల్వే బడ్జెట్ 2014 - 15
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జులై 2025 (11:21 IST)

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

mahakali bonalu
పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిన మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో భాగంగా, ఆదివారం ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. ఇక బోనాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1200 మంది పోలీసులు, 10 షీ టీమ్స్‌తో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తును కట్టుదిట్టం చేశారు. 
 
అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేకంగా ఒక క్యూలైన్ ఏర్పాటు చేశారు. అలాగే, భక్తుల కోసం రెండు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.