Religion News

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు



Vangaveeti Radha: జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధ

Vangaveeti Radha: జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధఅన్ని ఊహాగానాలకు తెరదించుతూ, వంగవీటి రాధా బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికారికంగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ కూడా పార్టీలో చేరారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇంకా విజయవాడ మేయర్ పదవికి వంగవీటి రాధా పేరును, తిరుపతి మేయర్ పదవికి ప్రణీత్ ప్రమోద్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వంగవీటి రాధా మొదట 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

కూరగాయలు కొంటూనే గుండెపోటుతో కుప్పకూలి వ్యక్తి దుర్మరణం, వీడియో

కూరగాయలు కొంటూనే గుండెపోటుతో కుప్పకూలి వ్యక్తి దుర్మరణం, వీడియోఇటీవలి కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆందోళన రేకెత్తిస్తోంది. సూర్యపేట జిల్లా చిలుకూరు మండలం బెతవోలు గ్రామంలో బెజవాడ శ్రీనివాస్ అనే వ్యక్తి కూరగాయలు కొంటూనే కుప్పకూలి దుర్మరణం చెందాడు. అక్కడే వున్నవారు వెంటనే అతడికి సీపీఆర్ చేసి కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. గుండె సమస్యలు ఎందుకు వస్తున్నాయి? వర్షాకాలంలో ఫ్లూ, జలుబు, దగ్గు, టైఫాయిడ్, డెంగ్యూ వంటి శ్వాసకోశ మరియు నీటి ద్వారా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. ఈ ఇన్‌ఫెక్షన్లు శరీరంపై, ముఖ్యంగా గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.

Amaravati: 2028-29 ప్రారంభం నాటికి అమరావతికి రైలు సౌకర్యం

Amaravati: 2028-29 ప్రారంభం నాటికి అమరావతికి రైలు సౌకర్యంరూ.2,047 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 57 కిలోమీటర్ల రైల్వే లైన్ ద్వారా, 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభం నాటికి అమరావతికి రైలు సౌకర్యం లభించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదిత మార్గం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఎర్రుపాలెంను, గుంటూరు సమీపంలోని నంబూరుతో కలుపుతూ అమరావతి రాజధాని ప్రాంతం గుండా వెళ్తుంది. రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా విభజించింది. మొదటి మూడు ప్యాకేజీలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉండగా, నాలుగో ప్యాకేజీకి బిడ్లు ఆహ్వానించబడ్డాయి. భూసేకరణ, అవసరమైన అనుమతులపై ఆధారపడి, నిర్మాణ పనులు పూర్తి కావడానికి సుమారు రెండేళ్లు పట్టవచ్చని అంచనా.

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?నవరాత్రి పూజను సాధారణంగా మూడు విధాలుగా చేస్తారు. బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉన్నవారు బొమ్మల కొలువును పెట్టి, ఆ ఆచారం లేని వారు కలశం ఏర్పాటు చేసి, అఖండ జ్యోతిని వెలిగించి నవరాత్రి పూజను చేస్తుంటారు. భక్తులు దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి నవరాత్రి మొదటి రోజున అఖండ దీపాన్ని వెలిగించి, తొమ్మిది రోజులూ అది ఆరిపోకుండా కాపాడుతూ పూజించడం ఆనవాయితీ. ఈ జ్యోతి జ్ఞానం, పవిత్రత, అదృష్టం, సానుకూల శక్తి, సౌభాగ్యానికి చిహ్నంగా నమ్ముతారు. ఈ సంవత్సరం, శరన్నవరాత్రులు 2026 అక్టోబర్ 11వ తేదీన ప్రారంభమై, అక్టోబర్ 20వ తేదీన దసరాతో ముగుస్తాయి. నవరాత్రి మొదటి రోజున, భక్తులు ఆరని జ్యోతి (అఖండ జ్యోతి)ని వెలిగించి, దానిని తొమ్మిది రోజుల పాటు వెలుగుతూ ఉంచుతారు.