ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (16:43 IST)

బడ్జెట్ 2021-22 : లాభాల బాటలో సెన్సెక్స్ - నిఫ్ట్

కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్టెట్‌ మార్కెట్‌లో ఫుల్ జోష్ నింపింది. ఈ బడ్జెట్ కార్పొరేట్ వర్గాలను మెప్పించడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తారాజువ్వలా దూసుకెళ్లాయి. 
 
లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో మార్కెట్లలో జోష్ నెలకొంది. ఒక్కసారిగా పుంజుకున్న మార్కెట్లు చివరి వరకు లాభాల్లోని ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,315 పాయింట్లు లాభపడి 48,601కి పెరిగింది. నిఫ్టీ 647 పాయింట్లు లాభపడి 14,281కి ఎగబాకింది. 
 
సోమవారం అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. బ్యాకింగ్ 8.33 శాతం, ఫైనాన్స్ 7.49 శాతం, రియాల్టీ 6.65 శాతం పెరిగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ అండ్ టీ లాభాలను అర్జించగా, కేవలం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్,  టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీల షేaర్లు స్వల్పంగా నష్టపోయాయి.