శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (11:14 IST)

ఫిఫా వరల్డ్ కప్ : మాయ చేసిన నెయ్‌మార్... మెక్సికో చిత్తు.. బ్రెజిల్ విన్

'ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా' అనేది ప్రిన్స్ మహేష్ బాబు చిత్రంలోని ఓ ఫేమస్ డైలాగ్. అక్షరాలా ఈ డైలాగ్‌ను నిజం చేస్తూ బ్రెజిల్ స్టార్ స్ట్రైకర్ నెయ్‌మార్ ఫిఫా ప్రపంచకప్ నాకౌట్

'ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా' అనేది ప్రిన్స్ మహేష్ బాబు చిత్రంలోని ఓ ఫేమస్ డైలాగ్. అక్షరాలా ఈ డైలాగ్‌ను నిజం చేస్తూ బ్రెజిల్ స్టార్ స్ట్రైకర్ నెయ్‌మార్ ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. లీగ్‌దశలో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. కీలకమైన నాకౌట్ పోరులో అద్భుతమైన ఆటతీరుతో అదరొట్టాడు.
 
ప్రత్యర్థి మెక్సికోతో జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో గోల్ సాధించడమే కాదు.. మరో గోల్ అందించేందుకు అవసరమైన పాస్‌ను అందించి 2-0 తేడాతో మెక్సికోపై బ్రెజిల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శుక్రవారం సమారా అరీనాలో మెక్సికోతో జరిగిన రెండోరౌండ్ పోరులో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ జట్టు విజయంతో క్వార్టర్స్ చేరుకుంది. 
 
పేలవ ఆటతీరుతో మాజీ చాంపియన్లు అందరూ వెనుదిరుగుతున్న దశలో టైటిల్ ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ కీలకమైన సమయంలో చాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. జట్టులోని స్టార్ నెయ్‌మార్ (51వనిమిషం), రాబెర్టో ఫిర్మినో(88వ నిమిషం)గోల్ సాధించి జట్టుకు ఘన విజయం అందించారు. మెక్సికో జట్టు ఎంతగా పోరాడినా.. బ్రెజిల్ జోరును అడ్డుకోలేక పోవడంతో మరోసారి నిరాశగా ప్రపంచకప్‌ నుంచి ఇంటిముఖం పట్టింది.
 
ఈ మ్యాచ్‌ తొలి అర్థభాగం పోటాపోటీగా జరిగినప్పటికీ విరామ సమయం తర్వాత బ్రెజిల్‌ దూకుడు పెంచింది. రెండు గోల్స్‌ కొట్టడంతో పాటు బ్రెజిల్‌ రక్షణ శ్రేణి బలంగా ఉండటంతో మెక్సికో గోల్‌ యత్నాలు ఫలించలేదు. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌ల్లోనూ బ్రెజిల్‌ పాల్గొంది. కాగా, క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రెజిల్… బెల్జియంతో తలపడనుంది.