గ్వాలియర్‌లోని ఓ రోడ్డుకు సచిన్ టెండూల్కర్ పేరు!

SELVI.M|
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. భారత లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ గ్వాలియర్‌లో సాధించిన అజేయ డబుల్ సెంచరీని మధ్యప్రదేశ్ మరిచిపోకుండా, వన్డే క్రికెట్‌లో సచిన్ సాధించిన ఈ అరుదైన ఘనతకు గుర్తుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గ్వాలియర్‌లోని ఓ రోడ్డుకు సచిన్ పేరు పెట్టింది.

గతేడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో గ్వాలియర్ వేదికగా జరిగిన వేన్డేలో సచిన్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్వాలియర్ హైకోర్టు నుంచి హురాల్వి గ్రామం వరకు రూ. 2.89 కోట్లతో నిర్మించిన 3.55 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల రోడ్డుకు సచిన్ పేరు పెట్టారు.


దీనిపై మరింత చదవండి :