ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (19:17 IST)

తెలంగాణ: రెండు కోట్ల రూపాయలను సీజ్ చేసిన పోలీసులు

Telangana Assembly Elections
తెలంగాణ ఎన్నికల సందర్భంగా లెక్కల్లో చూపని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గత నెలలో ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. 
 
బుధవారం రంగారెడ్డి జిల్లా అంబర్ పేట పోలీసులు రెండు కార్లను అడ్డగించి తనిఖీ చేయగా రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల నోట్ల కట్టలు లభించాయి. సరైన పత్రాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
తనిఖీలు నిర్వహించి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డిలోని పెద్ద అంబర్‌పేట వద్ద పోలీసులు 2 కార్లను అడ్డగించగా 2 కోట్ల నగదు దొరికింది.