పదిహేనేళ్ళ వయసు నుండి నటనారంగంలో నాకున్న ఆసక్తి, పలు టీవీ సీరియళ్ళలో నటించిన అనుభవంతో నటిగా తెలుగు సినిమాలో నటించే అవకాశం పొందాను అంది నటి ప్రియాంక చాబ్రా. వెన్నెల కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న 'అతడు.. ఆమె.. ఓ స్కూటర్' చిత్రంతో నటిగా పరిచయమవుతుంది. గంగారపు లక్ష్మణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముత్తు కుమార్‌స్వామి సమర్పణలో పిరమిడ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అమరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. నటిగా తొలి సినిమా పట్ల తన అనుభవాల్ని పాత్రికేయులతో పంచుకున్నారు.