డాక్టర్. రాజేంద్రప్రసాద్, శివాజీ కాంబినేషనల్‌లో రూపొందుతున్న చిత్రం బ్రహ్మలోకం టు యమలోకం (వయా భూలోకం). లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ (గోపీ), రూపేష్ డి. గోహిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. అందమైన ఫాంటసీ మిళితమైన చిత్రమిది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ బ్రహ్మదేవునిగాను, కళ్యాణి సరస్వతిదేవిగాను, ఆర్తీ అగర్వాల్ రంభగానూ, జయప్రకాశ్ రెడ్డి యమధర్మరాజుగాను ఇందులో కనిపిస్తారు. బ్రహ్మగా రాజేంద్రప్రసాద్‌ను వెండితెరపై అద్భుతంగా చూపిస్తారు. శివాజీ పాత్ర చిత్రణ కనువిందు చేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి అని తెలిపారు