అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన అనార్కలి చిత్రంలో హీరోయిన్గా చేసిన అలనాటి అందాల నటి, తెలుగు లోగిళ్ళ సీత అంజలీదేవి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం కన్నుమూశారు. ఆమెకు వయస్సు 86 యేళ్లు. తెలుగు చిత్ర పరిశ్రమలో సీత పాత్రలతో సినీ అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుని చిరస్థాయిగా నిలిచిపోయిన సినీ ధృవతార అంజలీదేవి.