ఈ రోజుల్లో ప్రేమకు విలువలేకుండా పోయింది. రోజుకో సెల్‌ఫోన్ మార్చినట్లు ప్రేమికులు తమ ప్రేమల్నికూడా మార్చేస్తున్నారు. అంతరాల వ్యత్యాసం వల్ల యువత ఏమి కోల్పోతుందనేది ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపించే ప్రయత్నం చేస్తుంది ఈ నాటియువత. గుడ్‌సినిమా ప్రొడక్షన్స్‌లో మారుతీ మీడియా హౌస్ పతాకంపై ఎస్.కె.ఎన్. నిర్మిస్తున్నారు. పలు యాడ్స్‌లో అనుభవంగల మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్ర లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో ఆదివారంనాడు జరిగింది. ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి, నిర్మాత, పబ్లిషర్ బి.ఎ.రాజు సంయుక్తంగా లోగోను ఆవిష్కరించారు. యామినేషన్‌రంగంలో నిష్ణాతుడైన దర్శకుడు మారుతీ చిత్రనటీనటుల్ని పరిచయం చేసే కార్యక్రమం ఆకట్టుకుంది. దీనితోనే తనలోని ప్రతిభను దర్శకుడు రుచి చూపించాడని అచ్చిరెడ్డి ప్రశంసించారు. ఈరోజుల్లో యువత, వ్యవస్థ ఎలా ఉందనేది ప్రధానంశంగా తీసుకుని దాన్ని పూర్తి వినోదాత్మకంగా తీయడం అభినందించతగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు.