1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 జూన్ 2015 (13:59 IST)

బాహుబలితో ''శ్రీమంతుడు''కి బ్రేక్: జూలై రెండో వారంలో ఆడియో, ఆగస్టు 7 సినిమా

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'శ్రీమంతుడు' విడుదల తేదీలో మార్పు జరిగింది. ఆగస్టు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. జూలై 18న ఆడియో ఆవిష్కరించనున్నారు. జూలై రెండో వారంలో ఈ సినిమా విడుదల చేయాలనుకున్నప్పటికీ, అదే వారంలో 'బాహుబలి'  చిత్రం విడుదల కానుంది. ఒకే వారంలో రెండు భారీ సినిమాలు విడుదలైతే నిర్మాతలు నష్టపోయే ఛాన్సుందని సినీ యూనిట్ భావించింది. 
 
అందుకే ''శ్రీమంతుడు'' విడుదల తేదీని ఆగస్టు 7కు మార్చినట్లు నిర్మాతలు, దర్శకులు తెలిపారు. కాగా 'శ్రీమంతుడు' కోసం మహేష్ బాబు అభిమానులు ఆగస్టు వరకు ఆగాల్సిందే. కాగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాను జూలై 10న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.