Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ఒక వారమే మిగిలివుంది. మేకర్స్ తెరలు తెరవడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, 14వ వారానికి నామినేట్ చేయబడిన పోటీదారులు డెమన్ పవన్, సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, తనుజ, భరణిలు వున్నారు. నామినేట్ చేయబడిన పోటీదారుల కోసం ఓటింగ్ లైన్లు తెరవబడ్డాయి. షో అభిమానులు తమ అభిమాన పోటీదారులకు ఓటు వేయడం ప్రారంభించారు.
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21, 2025న జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే, షో అధికారిక ముగింపు తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో లాస్ట్ వీక్‌కు ముందు మరో ట్విస్ట్ చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఫినాలే వీక్‌కు టాప్-5 కాకుండా టాప్-6 కంటెస్టెంట్లను తీసుకుంటారని సమాచారం. మరోవైపు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన రీతుకు బంపరాఫర్ వచ్చిందని టాక్.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఈ వారం బిగ్ బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పడాల కల్యాణ్ ఇప్పటికే ఫైనల్ టికెట్ సంపాదించాడు. ఇక తనూజ, ఇమ్మాన్యుయేల్ ఫైనల్ చేరడం ఖాయమే.
ఇక మిగిలింది డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, సంజన గల్రానీ. ఇందులో ఈ వారం సుమన్ శెట్టి లేదా సంజన గల్రానీ ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఫినాలే వీక్ కు కల్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, భరణితో పాటు సంజన లేదా సుమన్ లో ఒకరు అర్హత సాధించొచ్చు.