గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2025 (16:21 IST)

Sreeleela: ఏఐ-జనరేటెడ్ నాన్సెన్స్‌కు మద్దతు ఇవ్వవద్దు.. శ్రీలీల

Sreeleela
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఏఐపై నిప్పులు చెరిగింది. బుధవారం ప్రతి సోషల్ మీడియా వినియోగదారుడిని ఏఐ-జనరేటెడ్ నాన్సెన్స్‌కు మద్దతు ఇవ్వవద్దని కోరింది.తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ భావోద్వేగ రిక్వెస్ట్‌ను పోస్ట్ చేస్తూ, ఇలా రాసుకొచ్చింది. 
 
"నేను నా చేతులు జోడించి, ఆల్-జనరేటెడ్ నాన్సెన్స్‌కు మద్దతు ఇవ్వవద్దని ప్రతి సోషల్ మీడియా వినియోగదారుని అభ్యర్థిస్తున్నాను. టెక్నాలజీని ఉపయోగించడం, దుర్వినియోగం చేయడం మధ్య తేడా ఉంది. టెక్నాలజీలో పురోగతి జీవితాన్ని సరళీకృతం చేసేందుకు ఉద్దేశించింది.

కానీ నా అభిప్రాయం ప్రకారం దానిని క్లిష్టతరం చేయడానికి కాదు. ప్రతి అమ్మాయికి ఒక కుమార్తె, మనవరాలు, సోదరి, స్నేహితురాలు లేదా సహోద్యోగి ఉన్నారు. మహిళలు ఏదైనా వృత్తిని ఎంచుకుంటోంది. అలాంటి మహిళలు సురక్షిత వాతావరణంలో వుండాలని కోరుకుంటున్నాను.. అని శ్రీలీల పేర్కొంది. 
 
ఇంకా ఆ పోస్టులో "నా షెడ్యూల్స్ కారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న అనేక విషయాల గురించి నాకు తెలియదు. దీనిని నా దృష్టికి తెచ్చినందుకు నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఏఐ వల్ల చాలా మంది బాధపడుతున్నారు. నా తోటి సహోద్యోగులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 
 
అందరి తరపున నేను కోరుతున్నాను. దయ, గౌరవంతో నా ప్రేక్షకులపై నమ్మకంతో, దయచేసి మాకు మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నాను... అని శ్రీలీల కోరింది.