గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2025 (14:58 IST)

Anaswara Rajan: టాలీవుడ్ లో కార్ వాన్స్, బడ్జెట్ స్పాన్ చూసి ఆచ్చర్య పోయా : అనస్వర రాజన్

Anaswara Rajan
Anaswara Rajan
దక్షణాది సినిమా చరిత్రలో తెలుగు సినిమాలో స్పాన్ ఎక్కువ. మలయాళం లో  మాగ్జిమం 50 రోజులు షూటింగ్ చేయడం గ్రేట్. మలయాళం  లిమిట్ ఇండస్ట్రీ. కాని టాలీవుడ్ లో షూటింగ్ లో పాల్గొంటే చాల విషయాలు తెలుసుకున్నాను అని మలయాల నటి అనస్వర రాజన్ చెపుతోంది. స్వప్న సినిమాస్ బేనర్ లో ఛాంపియన్ చిత్రంలో నటించింది. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  రోషన్ కథానాయకుడు. ప్రమోషన్ లో భాగంగా ఆమె పలు విషయాలు తెలిపారు. 
 
ఇక్కడ టీం చాలా హెల్ప్ చేసింది. తెలుగు భాష అస్సలు తెలియదు. నాకు నేర్పించారు. షూటింగ్ లో బాగా ట్రీట్ చేసారు. నిర్మాత లావిష్ గా నిర్మిస్తున్నారు. షూటింగ్ లో దాదాపు 20 కార్ వాన్స్ ఉండేవి. ఇక్కడ గౌరవం ఎక్కువ.పీరియాడిక్  బాక్ డ్రాప్ కథ కనుక డ్రెస్, ఆభరణాలు కోసం ప్రత్చేకత తీసుకున్నారు. మలయాళంలో ఇంతలా నేను చూడలేదు.
 
మోహన్ లాల్ తో  ఓ సినిమాలో నటించాను. చాలా సింపుల్ గా లొకేషన్ లో ఉండేది. ఆర్భాటాలు ఉండవు. తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి అయ్యేది. టాలీవుడ్ లో డిఫరెంట్ గా ఉంది. ఒక్కోసారి ఆశ్హర్యం కలిగేది అని తెలిపారు. గత ఎడాధీ ఓ సినిమాలో అవకాసం వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. 
 
నేను తెలుగు సినిమాలు ఎక్కువ గా చూస్తాను. అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఆయనతో నటించాలని ఉంది అని తెలిపింది.   ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన గిరిగిర, సల్లంగుండాలే పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. క్రిస్ మస్ కు సినిమా విడుదల కాబోతుంది.