సోమవారం, 9 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2025 (13:04 IST)

15 యేళ్ళుగా ఆ నొప్పితో బాధపడుతున్నా : అక్కినేని నాగార్జున

nagarjuna akkineni
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తనకున్న అనారోగ్య సమస్యను వెల్లడించారు. గత 15 యేళ్ళుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నట్టు వెల్లడించారు. వీలైనంత మేరకు సర్జరీని తప్పించుకునేందుకే ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. పీఆర్పీ ట్రీట్మెంట్, రిహాబ్ చేయించుకున్నట్టు వెల్లడించారు. నొప్పి లేకపోయినా రోజూ మోకాలికి వ్యాయామం చేస్తానని నాగార్జున తెలిపారు. 
 
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి నాగార్జున మాట్లాడుతూ, సుమారు 15 యేళ్ళ క్రితం నాకు మోకాలి నొప్పి మొదలైంది. అప్పటి నుంచి ఈ సమస్యతో బాధపడుతూనే ఉన్నాను. అయితే, ఇప్పటివరకు మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకోలేదు. దాన్ని వీలైనంత వరకు వాయిదా వేయాలనే ప్రయత్నం చేస్తున్నాను అని వెల్లడించారు. 
 
మోకాలి నొప్పి నుంచి ఉపశమనం కోసం ల్యూబ్రికెంట్స్ ఫ్లూయిడ్స్, పీఆర్పీ వంటి చికిత్సలు తీసుకున్నట్టు నాగార్జున తెలిపారు. డాక్టర్ల సహాయంతో మోకాలి లోపలి కణజాలం పునరుత్పత్తి అయ్యేలా చూసుకున్నాను. నొప్పిలేని రోజుల్లోకూడా ఉదయాన్నే మోకాలి కోసం ప్రత్యేక రిహాబ్ చేసేవాడిని నిరంతరం దానిపై దృష్టి పెట్టాను తన క్రమశిక్షణ ఉన్న కష్టాన్ని వివరించారు. 
 
అయితే, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. సర్జరీ మాత్రం వద్దనుకుంటున్నానని ఆయన తేల్చి చెప్పారు. నాగార్జున వ్యాఖ్యలతో ఆయన ఫిట్మెస్‌కు ఎంతటి క్రమశిక్షణ, పట్టుదల ఉన్నాయో అర్థమవుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.