ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (19:50 IST)

నిత్యామీనన్ డియర్ ఎక్సెస్ పోస్టర్ అదుర్స్

Dear Exes
Dear Exes
ప్రముఖ నటి నిత్యా మీనన్ తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానుల కోసం ప్రత్యేక పోస్టర్‌తో తన రాబోయే చిత్రం టైటిల్‌ను వెల్లడించింది. సోషల్ మీడియాలో నిత్యా మీనన్ తన కొత్త ప్రాజెక్ట్ "డియర్ ఎక్సెస్" టైటిల్, పోస్టర్‌ను షేర్ చేసింది.
 
నూతన దర్శకుడు కామిని దర్శకత్వం వహించిన "డియర్ ఎక్సెస్" ఒక చమత్కారమైన కథాంశంతో కూడిన ఫాంటసీ రిలేషన్ షిప్ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది. 
 
తమిళ చిత్రంలో నిత్యా మీనన్‌తో కలిసి ప్రశంసలు పొందిన నటులు వినయ్ రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్ తమ పాత్రలలో అద్భుతమైన నటనను ప్రదర్శిస్తారని భావిస్తున్నారు.