శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (16:27 IST)

సినిమా విజయంపై ఆస్కార్ ఎఫెక్ట్ వుండదు.. ఎంఎం కీరవాణి

keeravani
అగ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి తెలియని వారు ఉండరు. ఆయన పాటలు ఎంత మధురంగా ఉంటాయో అందరికీ బాగా తెలుసు. 1990 నుండి, ఆయన 190 చిత్రాలకు సంగీతం అందించాడు. సంగీత రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. 
 
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతం, బీజీఎం అందించి ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటతో సంచలనం సృష్టించాడు. 
 
తన సంగీత ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చలనచిత్ర అవార్డులలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. ‘ఆస్కార్’ అందుకున్న తర్వాత కూడా కీరవాణి తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
 
ఇప్పుడు అక్కినేని నాగార్జున నా సామి రంగ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఎంఎం కీరవాణి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఎంఎం కీరవాణి మాట్లాడుతూ 'నాగార్జునతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంటుంది. ఆయనతో చేసిన సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. నా సామి రంగ కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుంది.
 
అయితే ‘ఆస్కార్’ అవార్డ్ తర్వాత చేస్తున్న సినిమా ఇదే కాబట్టి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిస్తూ.. ‘సినిమా విజయంపై ఆస్కార్ ప్రభావం ఏమాత్రం ఉండదు. నా విషయానికొస్తే, నేను బాగా పని చేయాలి. జనాదరణ పొందాలి అనుకుంటే సినిమా సక్సెస్ అవుతుంది. కానీ సినిమాలకు హైప్ తెచ్చేది విడుదలకు ముందు వచ్చే పాటలేనని కీరవాణి వ్యాఖ్యానించారు.