ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (18:03 IST)

రానా దగ్గుబాటి సమర్పణలో పరేషాన్

Thiruveer. Pavani Karanam
Thiruveer. Pavani Karanam
‘మసూద’తో బిగ్ హిట్ అందుకున్న యంగ్ హీరో తిరువీర్ ఇప్పుడు రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ‘పరేషాన్’ అనే హిలేరియస్ ఎంటర్‌ టైనర్‌ తో వస్తున్నాడు. వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జూన్ 2న ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. 
 
తెలంగాణ లోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వాసు పెండం డీవోపీ గా వ్యవహరిస్తుండగా యశ్వంత్ నాగ్ సంగీతం సమకూర్చుతున్నారు. శ్రీపాల్ ఆర్ట్ డైరెక్టర్.  
 
తారాగణం: తిరువీర్. పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుద్దెర ఖాన్, రవి, రాజు బేడిగల, శృతి రాయన్, అంజి బాబు వాల్గమాన్, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత, సురభి రాఘవ, శివరామ్, సాయి కిరణ్ యాదవ్