గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2025 (18:09 IST)

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

Maruti, Rana Daggubati, TG Vishwa Prasad, Roshan Kanakala
Maruti, Rana Daggubati, TG Vishwa Prasad, Roshan Kanakala
రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025 తో అలరించబోతున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. ప్రీమియర్లు 12న ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  ఈ వేడుకలో హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
 
రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. డైరెక్టర్ కాకమునుపే సందీప్ నాకు తెలుసు .కలర్ ఫోటో లాంటి అద్భుతమైన సినిమా చేశాడు. తను ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చిందని చాలా బాధపడుతూ మాట్లాడాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. టైం టెంపరరీ సినిమా అనేది  ఫరెవర్. కలర్ ఫోటో లానే మొగ్లీ కూడా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అవుతుంది. హీరో మోగ్లీ, విలన్ నోలన్.. ఈ క్యారెక్టర్లు చూస్తున్నప్పుడే చాలా మ్యాడ్ నెస్ కనిపిస్తుంది. చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. రోషన్. రోషన్ మా ఇంట్లో  అబ్బాయి. తనకి సినిమా మీద ఉన్న ప్రేమ పిచ్చి మీరు స్క్రీన్ మీద చూస్తారు. తనని  చూస్తుంటే చిరుత సినిమాలో చరణ్ ని చూస్తున్నట్టుగా అనిపించింది. రోషన్ కి ఆల్ ది వెరీ బెస్ట్. సింహం 12న వస్తుంది. మోగ్లీ 13న వస్తున్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
 
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. లాస్ట్ వీక్ జరిగిన కొన్ని పరిస్థితుల వలన ఒక పెద్ద సినిమాతో మేము రావాల్సివస్తుంది. ఒక రోజు ఆలస్యంగా రావడం వల్ల ఆ సినిమా చూసిన అందరూ మా సినిమాని కూడా చూస్తారని కోరుకుంటున్నాం. ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ వచ్చింది. అయితే దీనికి కారణం ఒక ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ .బండి సరోజ్ ఆ పర్ఫామెన్స్ ఇచ్చారు. సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే మీరు ఆ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. .
 
హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ప్రేక్షక దేవుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బాలయ్య గారి ఆశీస్సులు ఆయన ఫ్యాన్స్ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాని ముందుకు తీసుకెళుతున్న రానా గారికి థాంక్యూ సో మచ్. ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని తీసుకొచ్చి నాతో సినిమా చేసిన డైరెక్టర్ సందీప్ రాజు గారికి థాంక్యూ సో మచ్. సినిమాని ప్రొడ్యూస్ చేసి మా అందరిని సపోర్ట్ చేసిన విశ్వప్రసాద్ గారికి థాంక్యూ. ఈ సినిమాని చాలా డిగ్నిటీ తో ముందుకు తీసుకువచ్చారు. చాలా ప్రేమతో సినిమా చేశారు. కాలభైరవ తన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేశాడు. టీం అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. సాక్షి  అద్భుతంగా చేసింది. హర్ష  పెర్ఫార్మర్ డిఫరెంట్ గా వుంటుంది. బండి సరోజ్ గారు చాలా జెన్యూన్ పర్సన్. ఆయన పెర్ఫార్మన్స్ ని థియేటర్స్ లో చూడ్డానికి నేను వెయిట్ చేస్తున్నాను.  మోగ్లీ తన ప్రేమ కోసం చేసిన యుద్ధం ఈ కత.  ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. యుద్ధంలో మనం గట్టిగా నిలబడి పోరాడాలి. మనల్ని మనం నమ్మాలి. అందరూ కూడా మోగ్లీ చేసే యుద్ధంలో తోడుండాలని కోరుకుంటున్నాను. గెలిపించాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 13న థియేటర్స్ లో సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
 
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... . విశ్వ గారు ఇండస్ట్రీని ఎంత పోషిస్తున్నారో నాకు తెలుసు. ఈ సినిమా ద్వారా మరొక అద్భుతమైన సక్సెస్ ఇచ్చి పీపుల్ మీడియా సంస్థ ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. బండి సరోజ్ గారిని ఎంచుకోవడం ఈ సినిమాకి మరో సక్సెస్. ఆయనకు నేను ఫ్యాన్ ని. ఈ టీం ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన రానా గారికి థాంక్యూ. ఆయన మంచి సినిమాని  ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
 
మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. భైరవ తన మ్యూజిక్ తో సినిమాని మరో లెవల్ కి  తీసుకెళ్లాడు. హర్ష అద్భుతమిన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అందులో బంటి క్యారెక్టర్ మీ అందరిని ఆకట్టుకుంటుంది. సాక్షి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. తను చాలా పెద్ద స్టార్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ని  ప్రాణం పెట్టి రాసుకున్నాను. సరోజ్ గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అది విలన్ కాదు యాంటీ హీరో అని అర్థమైంది. స్టార్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రోషన్ తో  జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి తనలో మొగ్లీని చూడడం మొదలుపెట్టాను. తను ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. ఇందులో ఒక్క గ్రీన్ మ్యాట్  షాట్  కూడా ఉండదు. ప్రతిదీ ఒరిజినల్ గా చేసాడు. రోషన్ ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమా ఎంత అద్భుతంగా వచ్చింది. తను పడిన కష్టానికి తప్పకుండా ఫలితం వస్తుంది.  ప్రేక్షకుడి సమయానికి వ్యాల్యూ ఇచ్చి తీసిన సినిమా ఇది. కామెడీ యాక్షన్ డ్రామా  విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.