సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 20 డిశెంబరు 2018 (15:55 IST)

విశాల్‌ను చంపేస్తా.. సినీ నటి వరలక్ష్మి

తమిళంలోనే కాదు తెలుగులోను సినీనటి వరలక్ష్మికి మంచి క్రేజ్ ఉంది. శరత్ కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటికే తమిళంలో యువ అగ్ర హీరోలతో నటించింది వరలక్ష్మి. 
 
పందెం కోడి -2, సర్కార్ సినిమాల్లో ప్రత్యేక పాత్రలో నటిస్తూ అందరినీ మెప్పించింది. అయితే సరదాగా ఈ మధ్య నీకు శత్రువు ఎవరని ప్రశ్నిస్తే విశాల్ అని సమాధానం చెప్పడంతో పాటు, చంపేయాలన్న కోపం విశాల్ పైన వుంటుందని వెల్లడించింది. 
 
ముద్దు పెట్టాలనుకుంటే ఎవరికీ పెడతావంటే శింబుకు పెడతానని సమాధానం చెప్పిందట వరలక్ష్మి. శింబును చూడగానే ఎక్కడో తెలియని ఆకర్షణ కలుగుతుందని చెబుతోందట వరలక్ష్మి. విశాల్, వరలక్ష్మిల మధ్య ప్రేమాయణం వుందనీ, అది చెడిపోయిందన్న వార్తలు ప్రచారంలో వున్న సంగతి తెలిసిందే.