సంబంధిత వార్తలు
- సంచితా శెట్టికి మథర్ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
- వంటమనిషి గన్ పడితే.. కథతో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ల సార్ మేడమ్
- Manoj: విజయ్సేతుపతిలా తెలుగులో సుహాస్ : మంచు మనోజ్
- విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
- నిత్యామీనన్ ను స్పూర్తిగా తీసుకుని తమ్ముడులో నటించా : వర్ష బొల్లమ్మ
నిత్యా మేనన్ ను సార్ మేడమ్ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..
Nithya Menon, Vijay Sethupathi
ఈ రోజు మేకర్స్ సార్ మేడమ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ''నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా' అని విజయ్ సేతుపతి డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మధ్య వచ్చే గొడవలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. పెళ్లి చూపులు, పెళ్లి లాంటి బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో మొదలైన ట్రైలర్ 'మమ్మల్నిద్దర్నీ విడదీసేయండి' అని నిత్యామీనన్ చెప్పిన డైలాగ్ తో ఊహించని మలుపు తీసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంది.
పరోటా మాస్టర్ గా విజయ్ సేతుపతి కనిపించిన సీన్స్ నవ్వులు పూయించాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మాస్ యాక్షన్ కూడా ఉండడం మరింత క్యూరియాసిటీ పెంచింది.
విజయ్ సేతుపతి మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ కెమిస్ట్రీ స్పెషల్ హైలట్ గా నిలిచింది.
డైరెక్టర్ పాండిరాజ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ ఫన్, ఎమోషన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. డిఓపి ఎం సుకుమార్ అందించిన విజువల్స్ బ్యూటీఫుల్ గా వున్నాయి.
ఫ్యామిలీ ఎమోషన్, ఫన్, రగ్గడ్ లవ్ స్టొరీ, మాస్ యాక్షన్ తో సార్ మేడమ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఈ సినిమా జూలై 25న థియేటర్లో విడుదల కానుంది.
