గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By దేవి
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2025 (02:13 IST)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

Akhanda 2- Balakrishna
నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ 2 తాండవం 11 వ తేదీ రాత్రి ప్రేమిర్స్ వేశారు. ఈ సినిమాలో సంయుక్త ఓ పాత్రలో నటించింది. బాలకృష్ణ రెండు పాత్రలు పోషించారు. అఖండ సినిమాలో  చేసినట్లే ఇందులోనూ ఎం. ఎల్. ఏ. గా, అఘోరా గా చేశారు. 12 వ తేదీన విడుదల అయినా ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. 
 
కథ: 
అఖండలో దుష్ట సంహారం చేసాక మరలా తన తమ్ముడి కుమార్తె కు ఆపద వస్తే పిలిస్తే వస్తానని అఘోర చెపుతాడు. ఆలా హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ ఓ సాధువు (మురళి మోహన్) శివ సన్నిధి కోసం, దేశం  కోసం తపస్సు చేయమని చెపుతాడు. ఆలా ఒంటి కాలిపై తపస్సు చేస్తాడు. 
ఇక దేశంలో ప్రధాని పదవి కోసం ప్రతిపక్షం నాయకుడు కన్నేసి ఉంటాడు. దేవుడు ఇండియాను కాపాడతాడు అని నమ్మే ప్రధానితో దేవుడు లేడని ప్రజలు  చెప్పేలా చేస్తాడు. అందుకు దేశ  ద్రోహులు అయిన చైనా, టిబెట్ మిలట్రీ జనరల్స్ తో చేతులు కలుపుతాడు.

వారి పన్నాగం తో ఇండియాలో కుంభ మేళ జరిగే టైములో గంగా నదిలో బయో వెపన్ తో విషంగా మారుస్తాడు. దాని వల్ల ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటారు. దానికి విరుగుడు మందు కోసం డి.ఆర్.డి.ఏ. సైన్టిస్ట్ లు కృషి చేసి సకెస్స్ చేస్తారు. దానిని దక్కించుకోవడానికి ప్రతిపక్ష నాయకుడు వేసిన పన్నాగం బెడిసికొడుతుంది. అది ఎలా? దేవుడు రూపంలో అఘోర మరల వఛ్చి ఏమిచేసాడు? అన్నది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
టైటిల్ కు తగినట్లు అఖండ 2 తాండవం చిత్రం బాలకృష అఘోర తాండవం మినహా మిగిలిన కథ అంతా అఖండ కు రీప్లేస్ లా అనిపిస్తుంది. కథలో స్టఫ్ లేదు. ఎమోషన్స్ లేవు. మదర్ సెంటిమెంట్ సరిగ్గా లేదు. కేవలం చైనా దేశం దుష్ట దేశంగా చూపించి కథను రాసుకున్నాడు బోయపాటి. 
 
పిశాచ గణాలను తన అధీనంలో ఉంచుకున్న పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. తన తండ్రి చావుకు కారణమైన అఘోరాను చంపే క్రమంలో ఆది పినిశెట్టి పాత్ర ఉంది. ఇద్దరిపై ఫైట్స్ ఆకట్టుకున్నాయి. అలాగే చైనా జనరల్ సైనికులతోనూ, ప్రతిపక్ష నాయకుడి రౌడీలతోనూ సాగే ఫైట్స్ సినిమాకు ఆకర్షణ. అంతకు మించి చిత్రంలో చెప్పుకోవడానికి పెద్దగా లేదు. 
 
దేవుడి గుడి గురించి అఖండ లో అఘోర చెప్పే డైలాగ్స్ ఉన్నట్లే అఖండ 2 లోనూ దేవుడు నమ్మకం గురించి ఉన్నాయి. ఇలా చాలా సన్నివేశాలు అఖండ లో చూసినట్లు అనిపిస్తాయి. అందుకే పెద్దగా కిక్ ఉండదు.
 
అందులో జగపతి బాబు పాత్ర ప్లేస్ లో మురళీమోహన్ ను పెట్టారు. ఎం.ఎల్. ఏ. పాత్ర బాలమురళి కృష్ణ (బాలకృష్ణ) రెండో పాత్ర. ఇంటిలో ఫంక్షన్ లో సంయుక్త డాన్స్ చేస్తుంది. ఇక చాలా పాత్రలు ఉన్నా అవేవి ఆకట్టుకోవు. బోయపాటి సినిమా అంటే బారి తారాగణం ఉండాలి. అలా ఈ సినిమా ఉంటుంది. 
 
ఇక థమన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ పర్వాలేదు. శివ తాండవం ఓకే.  తల్లి చనిపోతే ఏకంగా శివుడే అఖండ రూపంలో రావడం బాగుంది. కానీ అక్కడ శంభాషణలు ఎక్కువ పెట్టారు. మరోవైపు శివ తాండవం చేసే సన్నీ వేషం కూడా లింక్ కుదరలేదు. 
 
టెక్నీకల్ గా సిజి. వి. ఎఫ్స్ పైనే సినిమా ఆధారపడి ఉంది. ఓ దశలో కొన్ని సీన్స్ కల్కి సినిమాను గుర్తు చేస్తాయి. డైలాగ్ ల పరంగా బోయపాటి బాగా రాసుకున్నాడు. కానీ ఓవర్ లుక్ తో సినిమాను గాడి తప్పించాడు. 
 
అఖండ తాండవం కేవలం బాలకృష్ణ కోసమే చూడాలి. అంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు. 
 
- కేవలం సనాతన ధర్మం కోసం సినిమా తెసినట్లుంది. 
- కథలో కొర్ పాయింట్ కుంభ మేళ. సినిమాలో చూపించినట్లు పొరుగు దేశాలకు రాని ఆలోచన బోయపాటి చూపించినట్లుంది. దానిపై రేపు ఎవరైనా గొడవ చేసిన చేయవచ్చు అనిపిస్తుంది. 
రేటింగ్: 2.75/5