దెయ్యంకు పనిలేదు... రేప్ చేయడమే పని... అవును 2 రివ్యూ రిపోర్ట్
అవును 2 నటీనటులు : హర్ష, పూర్ణ, చలపతిరావు తదితరులు
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీయడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. దర్శకుడిగా రవిబాబుకు ప్రత్యేక ముద్రతో 'అవును' చిత్రాన్ని రూపొందించాడు. ఫస్ట్ సినిమాగా పూర్ణ అనే ఆర్టిస్టు చుట్టూ.. కథ తిరుగుతుంది. మొదటి భాగంలో... సిటీకీ దూరంగా చక్కటి వాతావరణంలో ఓ ఇల్లు తీసుకుంటారు. కానీ అక్కడ పూర్ణను ఓ దెయ్యం పరిశీలిస్తుంది. చివరికి అది దర్శకుడు రవిబాబు దెయ్యంగా కన్పించి ట్విస్ట్ ఇస్తాడు. ఇక సెకండ్ పార్ట్ చూద్దాం.
కథ: మొదటి భాగంలో పూర్ణ (మోహిని) బాడీ నుంచి రాజు ఆత్మ వెళ్ళిందని భావిస్తారు. హర్ష తన భార్యను తీసుకుని ఈసారి సిటీ మధ్యలో కాస్ట్‌లీ ఫ్లాట్‌లో దిగుతారు. మొదటి భాగంలో వున్న ఇల్లు మాదిరిగానే బెడ్‌రూమ్‌కు వస్తే ఆటోమేటిక్‌గా లైట్లు వెలుగుతాయి. అలాంటి ఇంటి కంటే కొంచెం ఎక్కువ టెక్నాలజీ వున్న ఇల్లు. సాఫీగా సాగుతుండగా ఓసారి ఓ సాధువు వచ్చి మోహినిపై ఆత్మ వచ్చి కోరిక తీర్చుకుంటుందని చెబుతాడు. అలా కాకుండా వుండాలంటే ఓ లాకెట్ లాంటిది ఇస్తాడు. అది ఏడాది పాటు తీయకూడదంటాడు. కానీ, దాన్ని తీయడానికి ఇతర పాత్రల ద్వారా రాజు అనే దెయ్యం ట్రై చేస్తుంది. ఇలా జరిగే కథలో చివరికి ఏమయింది? లాకెట్ తీసేసిందా? లేదా? అనేది సినిమా.
పెర్‌ఫార్మెన్స్:
నటి పూర్ణపైనే కెమెరా చూపించేశాడు. చీర కట్టుకోవడం, స్నానం చేయడం వంటివన్నీ చూపీచూపనట్లుగా చూపించేశాడు. ఇక మొదటి భాగంలో కంటే భర్తగా చేసిన హర్షకు ఈ చిత్రంలో నటనకు అవకాశముంది. భయం షేడ్స్ బాగా చూపించాడు. హీరో స్నేహితుడిగా చక్రవర్తి తళుక్కుమంటాడు. రవివర్మ, నిఖిత పాత్రలు కొత్తగా అనిపిస్తాయి. మరో నటి సంజన కూడా నటించింది. మిగిలిన వారు ఓకే.
సాంకేతికం:
ఇలాంటి హార్రర్ చిత్రాలకు సంగీతం కీలకం. దాన్ని శేఖర్ చంద్ర బాగానే చేశాడు. సాంగ్స్ వుండవు కాబట్టి రీ-రికార్డింగ్ ప్రత్యేకత. అయితే మొదటిభాగంలో వున్న భయపెట్టే బ్యాక్‌గ్రౌండ్ ఇందులో లేదు. కెమెరామెన్‌గా సుధాకర్ రెడ్డి ఫర్వాలేదు. నిర్మాణపు విలువలు డి.సురేష్ బాబు బాగానే చూపించాడు. డైలాగ్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలేదు.
విశ్లేషణ
భయం కల్గించే చిత్రాల్లో కథతో పాటు నెరేషన్ అద్భుతంగా వుండాలి. అలా వుంటేనే థియేటర్‌కు జనాలు వస్తారు. అవునులో ఇంకా భయపెట్టలేదని పార్ట్-2 తీసి భయపెట్టాలని చూసినా అందులో సరైన ట్విస్ట్‌లు లేకపోవడం మైనస్. ఎప్పుడూ హీరోయిన్ చీర కట్టుకోవడం, స్లోగా ఎవరో వెంటాడుతున్నట్లు పజిల్‌గా పెట్టాలనుకోవడం కూడా మైనసే. ఓ సాధువు వచ్చి డాలర్ లాంటి బిళ్ళను ఏడాది పాటు తీయకూడదంటాడు. దాన్ని వెయ్యి రూపాయలకు అమ్మేస్తాడు. సంజన అనే పాత్ర ఆత్మను షూట్ చేస్తుంది. కానీ మరోవైపు ఆత్మ వుందా? లేదా? అన్న చర్చ కూడా పెడతాడు.
దెయ్యంకు మరేమీ పని లేనట్లు.. పూర్ణను కేవలం రేప్ చేయడం పనిగా పెట్టుకుంటుంది. దాని కోసం తపిస్తుంది. ఆ సమయంలో ఆమె తొడలు, నైటీ విప్పడం, చెస్ట్‌ను చూపించడం వంటి జిమ్మిక్కులతో దర్శకుడు యూత్‌ను ఎట్రాక్ట్ చేయాలనుకున్నాడు. బాగా డబ్బున్న వాళ్ల ఇంట్లో దెయ్యాలకు ఇదే పని కాబోలు అనిపించేలా కథ వుంది. కొంతభాగం కాశీలో తీశామని చెబుతారు. మరి దీనికి మూడోపార్ట్ వుందంటూ ట్విస్ట్ ఇస్తాడు. ఏది ఏమైనా.. భయపెట్టాల్సిన సినిమా భయపెట్టేదిగా లేదు. ఇలాంటి సీక్వెల్స్ తీసేటప్పుడు మరింత ట్విస్ట్‌లు వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.