సీరియల్సంటే - అత్తాకోడళ్ల కథలు, భార్యాభర్తల వ్యధలే కాదు. కొత్తగా కూడా చెప్పొచ్చంటూ సరికొత్త సీరియల్‌తో ముందుకొస్తున్నారు 'మన' సంస్థ యం.డి, నిర్మాత - 'మన' చౌదరి. మన అడ్వర్టైజింగ్ సంస్థ ద్వారా విశేష ప్రజాదరణ పొందిన 'చి|| ల|| సౌ|| స్రవంతి' లాంటి పలు సీరియల్స్‌ని గతంలో ఈయన అందించారు.వచ్చే సోమవారం నుంచి జెమిని టీవీలో సాయంత్రం 7 గం.లకి ప్రసారం కానున్న 'మంథర' సీరయల్ గురించి 'మన' చౌదరితో ముఖాముఖి.సీరియల్‌కు 'మంథర' అనే నెగిటివ్ టైటిల్ పెట్టారు.. ఏమిటీ మీ సాహసం?'ధైర్యే సాహసే లక్ష్మి' అనే మాటను నేను బలంగా నమ్ముతాను. నా నమ్మకాన్ని ఎప్పుడూ ప్రేక్షకులు నిలబెడుతూనే ఉన్నారు.