ఆగ్నేయమూలకు గ్రహాధిపతి శుక్రుడు. పాలకుడు అగ్నిదేవుడు. వాహనము మేక. శుక్రుడు (రాక్షస గురువు). రాక్షసులకు ఉన్న వేగము, పాలకుడైన అగ్నిదేవునికి ఉన్న శక్తి ఈ ఆగ్నేయ మూలకు ఉన్నది. అందుచేత ఆగ్నేయమూలలో అతి పనికిరాదు. అన్ని మూలలు దిక్కులకంటే అత్యంత సూక్ష్మంగా ఆగ్నేయ దిక్కును చూసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం పొరపాటు చేసినా విపరీత పరిణామాలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.